Header Ads

సావిత్రిబాయిపూలెే

" First Indian Women Teacher "
(  సావిత్రిబాయిపూలెే  )



• జననం: 03 -01-1831న మహరాష్ట్రలో జన్మించింది
• మరణం: 10-03-1897.
• జీవితకాలం 66సంవత్సరాలు.
మెుట్టమెుదటి ఆధునిక భారతదేశ సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహత్మ జ్యోతిరావ్ పూలే గారికి భార్యగ జీవితాంతం తోడుగాఉంటూ, మహత్మ జ్యోతిరావ్ పూలే గారు శూద్రుల, అతి శూద్రుల కోరకు చేస్తున్నటువంటి
స్వతంత్ర్య పోరాటంలో సావిత్రిబాయిపూలెే గారు తనవంతు పాత్రను పోశించారు.


అదేవిదంగా
1. స్త్రీలంతా పాపగర్బం నుండి పుట్టినవారు ( భగవద్గీత 9-32)
2. శూద్రుడికి, స్త్రీకి విద్యనిషేదం (మనుస్మ్రతి 18-679)
3. శూద్రుడికి, స్త్రీకి చదువు చెప్పేవారు నరకానికి పోతారు ( మనుస్మ్రతి 3-156)

అన్నటువంటి మనువాద బ్రాహ్మనిజ సమాజానికి వ్యతిరేకంగా శూద్రులకు,స్త్రీలకు విద్యనందించడానికి 1873లో  " సత్యశోదక్ సమాజ్ " అనే సామాజిక సంస్థను స్థాపించి మెుట్టమెుదటిసారిగా ఈ దేశ మూలవాసులైనటువంటి యస్.సి.,యస్.టి.,బి.సి., మరియు మైనారిటిీలకు మహత్ములు సావిత్రిబాయిపూలెే, మహత్మ జ్యోతిరావ్ పూలే గారు చేస్తున్న ఈ పోరాటానికి మనువాద బ్రాహ్మణుల నుండి ఎన్నో ఆటంకాలు ఎదురైన సావిత్రిబాయిపూలెే గారు అధైర్యానికి గురికాకుండా జ్యోతిరావ్ పూలే గారితో ఉద్యమాన్ని నడిపిన పోరాటయోధురాలు సావిత్రిబాయిపూలే గారు.

మనిషిని మనిషిగా చూడకుండా జంతువులకన్నా హీనంగా చూసిన మనువాద బ్రాహ్మణిజ సంకెళ్ళ నుండి విముక్తి చేసి తోటి మనిషిని  మనిషిగా చూడాలని పురుషులకు, స్త్రీలకు సమాన అవకాశాలు ఉండాలని, శూద్రులకు, అతిశూద్రులకు, స్త్రీలకు విద్యనందించిన మెుట్టమెుదటి భారతదేశ "చదువులతల్లి సావిత్రిబాయిపూలే"

తన 66సం"ల సుధీర్ఘ జీవితకాలంలో స్త్రీలను మనువాదంనుండి విముక్తిచేసి చదువునేర్పింది సమాజం పరిపూర్ణ అవగాహన కల్పించింది, బ్రాహ్మనిజం యెుక్క మానసిక బానిసత్వం నుండి స్త్రీలను విముక్తులను చేసింది.



Theme images by Leontura. Powered by Blogger.