అక్షాంశాలు-రేఖాంశాలు
-భూమిపై ఉత్తర, దక్షిణ ధృవాల బిందువులు స్థిరం. కాబట్టి అక్షాంశాలు, రేఖాంశాలను గీశారు.
-అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను మొదటగా వాడినది హిపార్కస్.
అక్షాంశాలు:
-భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలే అక్షాంశాలు.
-ఉత్తర, దక్షిణ ధృవాలకు సమానదూరంలో భూగోళంపై గీసిన వృత్తానికి భూమధ్యరేఖ అని పేరు.
-భూమధ్యరేఖను 00 అక్షాంశం అని అంటారు.
-భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్ధభాగాలుగా విభజిస్తుంది.
-భూమధ్యరేఖ ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్థగోళం అని, దక్షిణ భాగాన్ని దక్షిణార్థ గోళం అని అంటారు.
-భూమధ్యరేఖ సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వృత్తాలు అక్షాంశాలు.
-అక్షాంశాలను సమాంతర రేఖలు అని కూడా అంటారు.
-అక్షాంశ రేఖలన్నింటిలోకి భూమధ్య రేఖ వృత్తం అతిపెద్దది. ఈ ప్రాంతంలో భూమి చుట్టుకొలత 40,075 కి.మీ. ఉంటుంది.
-మిగతావన్నీ పోనుపోను తగ్గి ధృవాల వద్ద బిందువుగా ఏర్పడతాయి.
-ఒక అక్షాంశం విలువ భూమధ్యరేఖ నుంచి ఉత్తరంగాగాని, దక్షిణంగాగాని ఆ అక్షాంశంపైగల బిందువుల నుంచి భూకేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖకు, భూమధ్యరేఖా తలానికి మధ్య ఉన్న కోణానికి సమానం.
-ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని ఉత్తర అక్షాంశాలని అంటారు.
-దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని దక్షిణ అక్షాంశాలని అంటారు.
-231/20ల ఉత్తర అక్షాంశరేఖను కర్కాటకరేఖ అని అంటారు.
-231/20ల దక్షిణ అక్షాంశరేఖను మకరరేఖ అని అంటారు.
-661/20ల ఉత్తర అక్షాంశరేఖను ఆర్కిటిక్ వలయం అని అంటారు.
-661/20ల దక్షిణ అక్షాంశరేఖను అంటార్కిటిక్ వలయం అని అంటారు.
-అక్షాంశాలన్నీ ఊహారేఖలు. ఇవి మొత్తం 0 అక్షాంశమైన భూమధ్యరేఖను కలుపుకొని 181 ఉన్నాయి.
-అక్షాంశానికి, అక్షాంశానికి మధ్య దూరం 111 కి.మీ. ఉంటుంది.
-00 అక్షాంశం వద్ద పగటికాలం 12 గంటలుంటుంది. ఈ పగటికాలం అక్షాంశాన్ని, రుతువులను బట్టి మారుతూ ఉంటుంది.
-అక్షాంశాలను డిగ్రీలు (0), నిమిషాలు (1), సెకండ్ల()గా సూచిస్తారు.
-అక్షాంశాల్ని ఇంగ్లిష్‌లో లాటిట్యూడ్ అంటారు. లాటిట్యూడ్ అంటే వెడల్పు అని అర్థం.
-లాటిట్యూడ్ అనే పదం లాటిన్ అనే పదం లాటిట్యూడో అనే పదం నుంచి వచ్చింది.
-అన్ని అక్షాంశాల్లో భూమధ్యరేఖ అతి పొడవైంది. రెండువైపులా అంటే ఉత్తర, దక్షిణ వైపులకు వెళ్లేకొద్దీ ఈ అక్షాంశాలు చిన్నవిగా కనిపిస్తాయి.
-అర్ధగోళాన్ని ఇంగ్లిష్‌లో HEMISPERE అంటారు. HEMI అంటే సగభాగం అని అర్థం.
-అక్షాంశానికి, మరొక అక్షాంశానికి మధ్యదూరం 111 కి.మీ.
రేఖాంశాలు:
-భూమధ్యరేఖను ఖండిస్తూ ధృవాలను కలుపుతూ భూమి చుట్టూ లంబంగా గీసినవి రేఖాంశ వృత్తాలు.
-వీటి అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
-భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
-ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమ
ధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అంటారు.
-00ల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. దీన్ని ప్రధాన రేఖాంశం అంటారు.
-గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 1800 రేఖాంశం ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
-తూర్పు రేఖాంశం వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
-పడమర రేఖాంశం వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
-ఇవి ఊహారేఖలు. భూమి 10 రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
-అక్షాంశ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
-రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
-ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
-ప్రపంచాన్ని రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
-రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
-లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
-ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
-రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
ఉపయోగాలు:
1) వీటి సహాయంతో భూగోళంపై ఒక ప్రదేశం ఉనికి సులభంగా గుర్తించవచ్చు.
2) కర్కాటక, మకర రేఖలు దాటి సూర్యుడి కిరణాలు నిట్టనిలులుగా పడవు. కాబట్టి అక్షాంశరేఖలతో ఒక ప్రదేశ శీతోష్ణస్థితి తెలుసుకోవచ్చు.
3) భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి రేఖాంశాల సహాయంతో వివిధ ప్రదేశాల్లో, కాలాల్లో తేడాలు గుర్తించవచ్చు. అందుకే రేఖాంశాలను కాలరేఖలని కూడా అంటారు.
అక్షాంశాలు, రేఖాంశాలన్నీ ఊహాజనిత గీతలు:
-ప్రతి రేఖాంశం వద్ద ఒక్కొక్క సమయం ఉంటుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి 00 రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని తూర్పు, పడమరలను కలిసి మొత్తం 24 కాల మండలాలను గుర్తించారు.
-ఒక్కొక్క కాలమండలం 150 రేఖాంశాల మేర ఉంటుంది.
-ఒక కాలానికి, మరొక కాలమండలానికి ఒక గంట తేడా ఉంటుంది.
-00 గ్రీనిచ్ రేఖ నుంచి తూర్పుకు వెలుతుంటే 4 నిమిషాల సమయం కలపాలి. పడమర వైపు వెళ్లితే 4 నిమిషాల సమయం తీసివేయాలి.
-దేశంలో 821/20ల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక సమయంగా గుర్తించారు (IST).
-IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం.
-భారత ప్రామాణిక రేఖకు, 0 గ్రీనిచ్ రేఖకు మధ్య 51/2 గంటల వ్యత్యాసం ఉంటుంది.