గ్రహణాలు
-సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళరేఖపై వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.
చంద్రగ్రహణం;
-సూర్యుడి కిరణాలు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
-పై నీడ భాగాన్ని ప్రచ్ఛాయ అని, నీడ చుట్టూ ఉన్న భాగాన్ని పాక్షిక ఛాయ అని అంటారు.
-పాక్షిక స్థాయిలో నీడ కొద్దిగా ప్రసరిస్తుంది.
-చంద్రుడు ప్రచ్ఛాయలోకి వచ్చినప్పుడు (పౌర్ణమి రోజు) చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
-చంద్రగ్రహణం అన్ని పౌర్ణమిల్లో ఏర్పడదు. కారణం చంద్రుడి కక్ష్యాతలం భూమి కక్ష్యాతలానికి 509 నిమిషాల కోణంలో ఉంది.
-చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 271/3 రోజుల సమయం పడుతుంది.
సూర్యగ్రహణం:
-సూర్యుడు కనబడకుండా భూమికి చంద్రుడు అడ్డువస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
-ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది.
-సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు చంద్రబింబం సూర్యుడికాంతి ఆవరణాన్ని కప్పినట్లు కనపడుతుంది. అప్పుడు నేరుగా చంద్రుడి నీడలో ఉన్న భూభాగంలో సంపూర్ణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాక్షికంగా గ్రహణం ఏర్పడుతుంది.
సహజ ఉపగ్రహాలు:
-మొత్తం సౌరకుటుంబంలో 8 గ్రహాలు, 181 ఉపగ్రహాలున్నాయి. కొత్తగా కనుగొన్న మరుగుజ్జు గ్రహాలు కూడా సౌరకుటుంబంలో భాగంగా ఉన్నాయి. ఇటీవల ప్లూటోను మరుగుజ్జు గ్రహంగా గుర్తించారు. గనిమెడ్ అనే ఉపగ్రహం అతి పెద్దది. ఇది గురుడు ఉపగ్రహం. అతి చిన్నది డెమోస్. ఇది అంగారకుని ఉపగ్రహం.
-NASA - (NATIONAL
AERONAUTICS & SPACE ADMINISTRATION) ప్రకారం బృహస్పతికి -63, యురేనస్-27, నెప్ట్యూన్ -13, మార్స్ -2, భూమి-1 ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.
-మరుగుజ్జు గ్రహమైన ప్లూటోకు మూడు ఉపగ్రహాలున్నాయి.
భూమి అంతర్గత నిర్మాణం
భూమిని ప్రధానంగా మూడు పొరలుగా విభజించవచ్చు.
-అయితే భూకేంద్ర మండలాన్ని తిరిగి రెండు పొరలుగా విభజించారు.
1. బయటికేంద్రభాగం 2,900-5,100 కి.మీ ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవరూపంలో ఉంటాయి.
2. లోపలికేంద్ర భాగం 5,100- 6,376 కి.మీ ఇనుము, లోహమిశ్రమాలు, బంగారం వంటి పదార్థాలు
-భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉంటుంది. దీనికి కారణం దీనికి కారణం భూకేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుంచి సముద్రతలంలోని పగుళ్ల నుంచి పైకివచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాల్లో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
భూమిగ్రిడ్ వ్యవస్థ
-అట్లాసును ఉపయోగించి ఒక ప్రదేశం అక్షాంశ, రేఖాంశాలను తెలుసుకోవచ్చు.
-ఇంటర్నెట్ ద్వారా గూగుల్ ఎర్త్ను ఉపయోగించి కూడా అక్షాంశ, రేఖాంశాలను తెలుసుకోవచ్చు.
-గ్లోబుపై అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఇవి అడ్డంగా, నిలువుగా గీయడంతో ఏర్పడిన గళ్లనే గ్రిడ్ అంటారు.
-ఈ గ్రిడ్ వ్యవస్థతో భూమి ఒక ప్రదేశం శీతోష్ణస్థితి, కాలం, ఇతర పరిస్థితులను తెలుసుకోవచ్చు.